Home తెలంగాణ ఇందిరా పార్క్ లో కాదు..కేంద్ర ప్రభుత్వం ఎదుట కిషన్ రెడ్డి ధర్నా చేయాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఇందిరా పార్క్ లో కాదు..కేంద్ర ప్రభుత్వం ఎదుట కిషన్ రెడ్డి ధర్నా చేయాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఇందిరా పార్క్ లో కాదు..కేంద్ర ప్రభుత్వం ఎదుట కిషన్ రెడ్డి ధర్నా చేయాలి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మూసీకి పైసా తీసుకురాని ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి
  • బండి పోతే బండి ఇస్తామన్నారు…ఆ త‌ర్వాత ఏ స‌హాయం చేయ‌లేదు
  • బీజేపీ ఈ నెల 25న త‌ల‌పెట్టిన ధ‌ర్నాను విర‌మించుకోవాల‌ని డిమాండ్ చేసిన‌ మంత్రి సీత‌క్క‌

ముద్ర, తెలంగాణ బ్యూరో :- గ’త పదేండ్లలో మూసీ ప్రక్షాళన కోసం గానీ.. మూసీ ప్రాంత ప్రజా సంక్షేమం, ఉపాధి కోసం గానీ నయా పైసా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర బీజేపీ నేతలు మొద‌ట ధర్నాలు చేశారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం గుండా మూసీ పారుతున్నా ఏనాడు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇప్పుడు మూసీ ప్రాంత ప్రజల త‌రుఫున ధ‌ర్నాకు పిలువునివ్వ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. మూసీ ప్రాంత ప్ర‌జ‌ల పక్షాన ఈ నెల 25న ఇందిరా పార్క్ వ‌ద్ద బీజేపీ త‌ల‌పెట్టిన ధ‌ర్నాను విర‌మించుకోవాల‌ని సీత‌క్క సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ముగ్గురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి వ‌హిస్తున్నందున ప‌ది వేల కోట్ల ను మంజురు చేయించాల‌ని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

రెండేళ్ళ క్రితం వ‌ర‌ద‌ల్లో మూసీ ప్రాంత ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయిన‌ప్పుడు బండికి బండి ఇస్తామ‌ని, ప్ర‌తి ఇంటికి న‌ష్ట‌ప‌రిహారం అందిస్తామ‌ని హ‌మీ ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం ఒక్క‌రిని కూడా ఆదుకోలేద‌ని మంత్రి సీత‌క్క గుర్తు చేసారు. ఇప్పుడు మూసీ ప్రాంత అభివృద్దిని అడ్డుకుంటూ ఆ పార్టీ తన నైజాన్ని బయ’టపెట్టుకుంటుంద’ని. గుజ‌రాత్‌లో స‌బర్మ‌తి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును స‌మ‌ర్దిస్తున్న బీజేపీ…ఇక్క‌డ మూసీ అభివృద్ది ప్రాజెక్టును ఎందుకు వ్య‌తిరేకిస్తుంద‌ని సీత‌క్క ప్ర‌శ్నించారు.

మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టు స‌క్సెస్ అయ్యి హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి ఎక్క‌డ ఇత‌ర న‌గ‌రాల‌ను దాటిపోతుందో అనే భ‌యం బీజేపీ నేత‌ల‌ను వేంటాడ ని…అందుకే మూసి యజ్ఞాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం మండిప‌డ్డారు. నిజంగా మూసీ ప్రాంత ప్ర‌జ‌ల‌ ప‌ట్ల ప్రేమ ఉంటే గ‌త ప‌దేండ్ల‌లో ఎందుకు వారిని ప‌ట్టించుకోలేదని ప్ర‌శ్నించారు. మూసీ డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టులో ఎక్క‌డా బ‌ల‌వంత‌పు త‌ర‌లింపులు లేవ‌ని, ప్ర‌జ‌ల స‌మ్మ‌తితోనే వారికి మ‌రో చోట స్థిర నివాసం, ఉపాధి క‌ల్పించిన త‌ర్వాతే ప్రాజెక్టు ప‌నులు ప్రారంభిస్తామ‌ని తెలిపారు. అయినా మూసీ పున‌రుజ్జీవ‌న వంటి మంచి కార్య క్ర‌మాన్ని అడ్డుకోవ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు.

గ‌త ప‌దేండ్ల‌లో మూసీ కోసం ఒక్క పైసా కేటాయించ‌లేద‌ని కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి పార్ల‌మెంటులోనే ప్ర‌క‌టించిన‌ప్పుడు బీజేపీ నేత‌లు ఎందుకు మౌనంగా ఉన్నారు? యూపీఏ హాయంలో మూసీ ప్ర‌క్షాళన కోసం 335 కోట్లు అయితే మోడీ పాల‌న‌లో పైసా ఇవ్వ‌క‌పోయినా మీరు ఎందుకు పెద‌వి విప్ప‌లేదు? అని సీతక్క ప్ర‌శ్నించారు. ప్రధాని మోడిగారు ప్రాతినిథ్యం వహిస్తున్న వార’సి లోని గంగా ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖ‌ర్చు చేసిందని… ఇత‌ర‌ న‌దుల ప్ర‌క్షాళన కోసం 6 వేల కోట్ల‌ కోట్లు చేసిందని గుర్తు చేసారు. కానీ మూసీ ప్ర‌క్షాళ‌న కోసం కేంద్ర ప్ర‌భుత్వం పైసా కేటాయించ‌క‌పోవ‌డం తెలంగాణ‌పై కేంద్రం వివ‌క్ష‌త‌కు నిద‌ర్శ‌నం కాదా? ఆ వివక్ష‌త‌ను మీరెందుకు ప్ర‌శ్నించ‌లేదు? అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందిరా పార్క్ వ‌ద్ద ధ‌ర్నాలు మానుకుని…సొంత‌ నియోజ‌క‌వ‌ర్గం గుండా పారుతున్న మూసీ అభివృద్ది కోసం పైసా తీసుకురాని కిష‌న్ రెడ్డి గారు ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటే మంచిద‌ని మంత్రి సీత‌క్క కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech