- ఈ చివరి నాటికి నియోజకవర్గానికి 4 వేల ఇందిరమ్మ ఇళ్లు
- నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
- కాళ్లలో కట్టెలు పెట్టిన అభివృద్ది సంక్షేమం ఆగదు
- గోషామహల్ నియోజకవర్గ లబ్దిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపణీలో మంత్రి పొంగులేటి
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ రోజు చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి తొలివిడగా 4 వేల ఇళ్లను అందించబోతున్నాం వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి’డమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్య’మ’న్న మంత్రి 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా నిర్మిస్తామని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండాఅర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే ఈ ప్రభుత్వ ఆశయమన్నారు. శనివారం గోషా మహల్ నియోజకవర్గానికి చెందిన 144 మంది లబ్దిదారులకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోజిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు అందజేసారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి భేషజాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వాటా, నిధులు అడిగారు. ఈ మేరకు పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఇండ్లను అందించాలని ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హౌసింగ్ జైంట్ సెక్రటరీని కోరింది. గత ప్రభుత్వం పేదవాడి గురించి కనీస ఆలోచన చేయలేదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందుల ఎదురైనా ప్రతిపక్షలు కాళ్లల్లో కట్టెలు పెడుతూ అభివృద్ది సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా ఏదీ ఆగదని పేదవాడి కన్నీరు తుడవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ కాకి గోలతో తమ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదనీ ఏడాది కూడా పూర్తి కాకముందే రోడ్డు ఎక్కితే ఆ పార్టీకే తీవ్ర నష్టం అన్నారు. పదేళ్ల పాలలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేనిది, తమ ప్రభుత్వం చేసి చూపిస్తే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తే బిఆర్ ఎస్ ఓర్చుకోలేక పోతోందన్నారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లుగా గోబెల్ ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణ కాదు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల జీవనోపాధి కోసం వారి జీవితాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాలం అదే మురికికుప్పలో బ్రతకాలని బీఆర్ కోరుకుంటుందా అని మంత్రి ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుందని.మూసి పునర్జీవనంపై అనేక అభాండాలు వేస్తున్నారనీ అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా..అని ప్రశ్నించారు. మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా అని నిలదీశారు. ఇప్పుడు వారికి డబుల్ బెడ్రూమ్ లు కేటాయించి మెప్మా ద్వారా వారికి అవకాశాలు,పిల్లలకు చదువులు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంటే ఓర్వలేకపోతున్నారు.తెలంగాణ ఏర్పడినప్పుడు ఖజానాలో పైసలతో ఇచ్చాం.. కానీ గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ బకాయిలు పెట్టి ఉన్నాయి. బాధ్యత గల ప్రతిపక్షం అయితే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వబడిన బీఆర్ ఎస్ నేతలను సూచిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన ఎలా చేయాలో ప్రతిపక్షాలకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, గణేష్ ఎమ్మెల్సీలు బలమూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి తదితరులు ఉన్నారు.