ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(పుష్ప 2)డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.దీంతో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెరగడం,మొన్న ఆదివారం చెన్నై వేదికగా 'కిస్సక్' సాంగ్ రిలీజ్ అయ్యింది. ముందుకు దూసుకుపోతు అల్లు అర్జున్ అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లో సరికొత్త జోష్ ని తీసుకొస్తుంది.ఇలాంటి టైం లో మరో న్యూస్ వాళ్ళల్లో ఎనలేని ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.
తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా(ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్)2024లో అత్యధిక పారితోషకం తీసుకున్న మొదటి పదిమంది నటుల జాబితా విడుదలైంది.అల్లుఅర్జున్ మూడువందల కోట్ల రూపాయిలు తీసుకున్న నటుడిగా మొదటి స్థానంలో నిలిచాడు.దీంతో పుష్పంతో పార్ట్ 2కి అల్లు అర్జున్ మూడువందల కోట్ల రూపాయల రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్నాడని అర్ధమవుతుంది.దీంతో తెలుగు హీరో స్థాయిని అల్లు అర్జున్ ఇండియన్ సినిమాకి చెప్పినట్టయ్యింది.
ఇళయ దళపతి విజయ్(విజయ్)లేటెస్ట్ గా వచ్చిన గాట్ మూవీకి రెండు వందల డెబ్భై ఐదు కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకొని రెండవ స్థానంలో ఉండగా,నూటయాబై నుంచి రెండు వందల కోట్ల దాకా తీసుకుంటూ షారుక్(shah rukh khan)మూడవ ప్లేస్ లో ఉన్నాడు.ఆ తర్వాత స్థానాల్లో రజనీకాంత్(rajinikanth)నూటయాబై నుంచి రెండువందల డెబ్భై కోట్లు,అమీర్ ఖాన్(amir khan)వంద నుంచి రెండువందల యాభై కోట్లు, ప్రభాస్(ప్రభాస్)వంద నుంచి రెండు వందల కోట్లు, అజిత్(అజిత్)నూట ఐదు నుంచి నూట అరవై ఐదు కోట్లు, సల్మాన్(salman khan)వంద నుంచి నూటయాబై కోట్లు, కమల్ హాసన్(కమల్ హాసన్)కూడా వంద నుంచి నూటయాబై కోట్లు, అక్షయ్ కుమార్(అక్షయ్) kumar)అరవై నుంచి నూతన నలబై ఐదు కోట్లు ఇలా తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది.