తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వటం లేదంటూ తెలుగు నటి రేఖ భోజ్ గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
'పెదకాపు' ఫేమ్ విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ నామా దర్శక'త్వం వహిస్తున్న 'నాగ'బంధం – ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తెలుగు అమ్మాయిలను తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఆ మూవీ లాంచ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. “వీళ్ళిద్దరి వల్ల ఒక పది టికెట్స్ కూడా ఎక్సట్రా తెగవు. అయినా సరే ఇలాంటి చిన్న ప్రాజెక్ట్స్ కి కూడా తెలుగు అమ్మాయిలను కాదని ఫ్లైట్ టికెట్స్, హోటల్ బిల్స్ మరియు భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి మరీ వీళ్ళను తెచ్చుకుంటారు ఖర్మ…. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇంకో జన్మ ఎత్తినా మారరు. వీళ్ళింటే ఇక లాస్ట్ లైన్ హీరోస్ అయిన సుహాస్, కిరణ్ అబ్బవరం, రాజ్ తరుణ్, సంతోష్ శోభన్ లాంటి వాళ్ళు కూడా లేరు.” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.