గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)అప్ కమింగ్ మూవీ గేమ్ చెంజర్(గేమ్ ఛేంజర్)క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవయ్యి లేదా ఇరవై గాని విడుదల అవ్వబోతుంది.ఈ విషయాన్నీరీసెంట్ గా కూడా నిర్మాత దిల్ రాజు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రకటించారు.ఈ రోజుల్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. సంబంధిత థర్డ్ సాంగ్ కూడా దివాళి రోజు విడుదల కాబోతుందని దర్శకుడు థమన్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి.
ఆర్ఆర్ఆర్ వచ్చిన చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ వస్తుంది.మధ్యలో ఆచార్య వచ్చినా అది మల్టిస్టారర్ ఖాతాలోకి వెళ్ళింది. దీంతో అభిమానులు చరణ్ వెంట వెంటనే సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కోరికకి తగ్గట్టుగానే తన సినిమాల విషయంలో చరణ్ వేగాన్ని పెంచాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభం అయిన చరణ్, ఆ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. ఈ మేరకు అధికారకంగాగ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్(prashanth neel)దర్శకత్వంలో చేయబోతున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా నిర్మాతగా పేరు తెచ్చుకున్న దానయ్యనిర్మాణ బాధ్యతలను అందించబోతున్నాడని కూడా అంటున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(ఎన్టీఆర్)తో చేయబోతున్నాడు.కొన్ని రోజుల క్రితం అధికారకంగా కూడా ఆ మూవీ పూజ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. దీని తర్వాత ప్రభాస్(ప్రభాస్)తో సలార్ 2 చెయ్యబోతున్నాడు.యష్ తో కేజీఎఫ్ 3 కూడా ఉందనే టాక్ అయితే ఎప్పట్నుంచో ఉంది.మరి ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ కూడా షూటింగ్ కి కొంచం ఎక్కువ టైం నే తీసుకుంటాయి. ఒక వేళ ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అయ్యే లోపు చరణ్ తన రెండు సినిమాలని కంప్లీట్ చేసుకుంటే కేజీఎఫ్ 3 కి వెళ్తాడా లేక చరణ్ తో సినిమా చేస్తాడా అనే చర్చ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది. కేజీఎఫ్ 3 కి బదులుగా రామ్ తో చేసే అవకాశాలే ఎక్కువ అంటున్నారు చరణ్.యష్,ప్రశాంత్ నీల్ కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందనే విషయం అందరికి తెలిసిందే.