- సర్కారు వ్యతిరేక పోస్టులను లైక్ చేసినా వేటే
ముద్ర, తెలంగాణ బ్యూరో : టీజీఎస్పీకి వ్యతిరేకంగా ఉండే వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందికి రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో టీజీఎస్పీకి వ్యతిరేకమైన పోస్టులను షేర్ చేసినా లైక్ చేసినా చర్యలు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బంది ఆందోళన నేపథ్యంలో సెక్రటేరియట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన సచివాలయంలో విధులు నిర్వర్తించే వారిపైన నిఘా ఉంటుందన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించే వారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ పోస్టులు పెడుతున్నారు? వాటిలో అత్యంత నిఘా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో అనవసరం జోక్యం చేసుకోద్దని సూచించారు. ఏ ఒక్కరు తప్పు చేసినా.. ఎఫెక్ట్ అందరి మీద ఉంటుందని. సోమవారం నుంచి సచివాలయం చుట్టూ 2 పరిధి వరకు 144 సెక్షన్ అమలులో ప్రదర్శన. కావున గురు కంటే ఎక్కవుగా గుమిగూడి ఉన్నా, ధర్నాలు, రాస్తారోకోలు, సచివాలయ ముట్టడి లాంటి వాటిలో ఐదుగురు పాల్గొంటారు, వారిమీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఈ సూచన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, తోట సిబ్బందికి తెలపాలని ప్రకటనలో సూచించారు.
ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వొద్దు
చాలా వాట్సాప్ గ్రూప్స్ లో అడ్మిన్ గా ఉంటూ, మిగిలిన సిబ్బందిని గ్రూప్ లో యాడ్ చేస్తూ టీజీఎస్పీ వ్యవస్థ గురించి మరియు పోలీస్ ఆఫీసర్స్ గురించి రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి మీద నిఘా ఉంటుందని.. అందరూ తక్షణమే అలాంటి గ్రూప్స్ నుండి ఎగ్జిట్ అవ్వాలని హెచ్చరిక. సిబ్బంది, సిబ్బంది కుటుంబ సభ్యులు ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తాకోలు లాంటి అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
లైక్ కొట్టినా చర్యలే..
టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్‌లలో టీజీఎస్పీ వ్యవస్థ గురించి, పోలీస్ ఆఫీసర్స్ గురించి మరియు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా పోస్ట్‌లు పెట్టడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, లైక్ చేయడం లాంటివి చేయవద్దన్నారు. ప్రతీ కదలికల మీద నిఘా ఉంటుందని.. పొరపాటున దొరికితే తక్షణమే శాఖపరమయిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు వీట ప్రస్తావిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.