సుహాస్(suhaas)హీరోగా దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన నూతన చిత్రం జనక అయితే గనక. విజయదశమి కానుకగా ఈ నెల 12న విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం(బందరు)లో జరిగింది.
ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంఎల్ఏ,రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర(kollu ravindra)ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బందర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కాణాచి. రఘుపతి వెంకయ్య నాయుడు, కమలాకర కామేశ్వరరావు, నిర్మలమ్మ, సుత్తివేలు, అచ్యుత్ వంటి ఉద్దండ నటులు ఇక్కడి వాళ్లే. గతంలో బాలకృష్ణ నటించిన పాండురంగడు ఫంక్షన్ కూడా ఇక్కడ జరిగింది. ఆ ఫంక్షన్ కి బాలకృష్ణ కూడా.మహా నటుడు ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాలో సినీ పరిశ్రమకి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు.
నోబుల్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుహాస్‌తో పాటు హీరోయిన్ సంకీర్తన విపీన్(sangeerthana vipin)దిల్ రాజు(dil raju)పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొంది.పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా విచ్చేయడంతో ఈవెంట్ భారీ స్థాయిలో సక్సెస్ అయ్యింది. సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ వంటి వారు కూడా ఈ మూవీలోప్రధాన పాత్రలు పోషించారు.