ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణం లో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన గందె సురేష్ ను సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రంగాలలో రాణించనున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాలని తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గండే సురేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యేలు ఆర్యవైశ్యులు కుల మతాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్, అంగనూరి విశ్వం, ఆర్యవైశ్య నాయకులు పలపట్ల మోహన్ రావు గజవాడేష్ బెజగం రమేష్ లష్కర్ కుమార్ పెద్ది రామ్మోహన్ ఎం వెంకట్ సానిశ్రీనివాస్ మలిపెద్ది శ్రీనివాస్ వైశ్య సంఘం సభ్యులు ఉన్నారు.