స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(puri jagannadh)ప్రస్తుతం వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్,రామ్ పోతినేని తో చేసిన డబుల్ ఇస్మార్ట్ పై పూరి ఎన్నో ఆశలు పెట్టుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.ప్రస్తుతానికైతే తన అప్ కమింగ్ మూవీ మీద ఇంకా ఎలాంటి అప్ డేట్ రాలేదు.
ఇక పూరి ఎప్పట్నుంచో సోషల్ మీడియాలో 'పూరి మ్యూజింగ్స్' ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.రీసెంట్ గా 'జాకెంట్' అనే అంశం మీద ఆయన మాట్లాడుతు యుద్ధ సమయాలతో పాటు రక రకాల ఇబ్బందుల వల్ల చాలా మంది ప్రజలు కట్టుబట్టలతో,భార్య బిడ్డలను తీసుకొని వేరే ప్రాంతాలకు వలస వెళ్తారు. వీరు ఏ దేశమైతే వెళ్తారో అక్కడ ఇల్లు అనేది.నైజీరియా,ఇరాక్,సుడాన్,ఇండియా,చైనా,కాలిఫోర్నియా,న్యూయర్,ఇరాక్, ఫ్లోరిడా దేశాల్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.ప్రపంచంలో ఐదు శాతం జనాభాకి ఇల్లు కూడా లేదు.ఇండియాలో అయితే నాలుగు కోట్ల మంది అడుక్కు తినే ఇల్లు కూడా లేదు. వాళ్ళు కూడా ఉన్నారు.అలాంటి వాళ్లంతా వర్షం వస్తే ఎక్కడ ఉండాలో పరిస్థితి.ఇలా వసతి సోకార్యం లేకుండా వడ దెబ్బతో పాటు తీవ్రమైన చలికి చాలా మంది చనిపోతున్నారు.
అలాంటి వారందరి కోసం 'ఏంజెలా లూనా' అంటే ఒక మహిళా డిజైనర్ ఒక అద్భుతమైన డిజైన్ ని సృష్టించింది.దాని పేరు 'జాకెంట్'.జాకెట్,టెంట్ ని కలిపి డిజైన్ చేసింది.దీన్ని జాకెట్ ల వేసుకోవడంతో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంట్ లా వాడుకొని అందులో పడుకోవచ్చు.పైగా ఈ జాకెంట్ ఎంతో మంది సిరియా శరణార్థులని కాపాడింది.ఇప్పుడు ఆ 'జాకెంట్'.ఇండియాకి వస్తే మనం
ఏదైనా కాంప్ కి వెళ్ళినప్పుడు వాడుకోవడంతో పాటుగా అడుక్కునే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు.ఏదైనా కంపెనీ దీనిని ఇండియాకి పరిచయం చేస్తే బాగుండు.ఎంతో మంది ప్రాణాలని కాపాడిన వాళ్లవుతారని చెప్పుకొచ్చాడు.