టాలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలై వచ్చారు. బెయిల్ పై వచ్చిన అల్లు అర్జున్ టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు, నిర్మాతలు, ఇతర నటీనటులు ఆయన ఇంటికి వెళ్లి సంఘీభావం తెలపడంతోపాటు తామున్నామన్న భరోసా కల్పిస్తున్నారు. అక్కడ లేని హీరోలు ఫోన్లు చేసి మరి బన్నీకి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ హీరోలు, నిర్మాతలు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. బయట ఉన్న తారక్, ప్రభాస్ వంటి హీరోలు ఫోన్ చేసి బన్నీ యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు కూడా బన్నీకి ఈ విషయంలో అండగా ఉన్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు అయితే తొలి నుంచి బన్నీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా బన్నీకి అండగా ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏపీ తెలంగాణలోని ప్రముఖులతోపాటు, కొన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా బన్నీకి అండగా ఉన్నామన్న సంకేతాలను స్వయంగా పరామర్శించారు. అల్లు అర్జున్ అరెస్టు కావడానికి అన్ని వర్గాలు ఖండిస్తున్నా.. మెగా ఫ్యామిలీ మాత్రం ఆశించిన స్థాయిలో స్పందించలేదన్న విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి, నాగేంద్రబాబు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ ఇద్దరు మినహా మెగా కుటుంబం నుంచి మరెవరు అరెస్టుపై స్పందించలేదు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్, ఇతర మెగా వారసులు స్పందించకపోవడం పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ పట్ల మెగా కాంపౌండ్ ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ పట్ల ఆవేదనతో మెగా ఫ్యామిలీ ఉందని ఈ కార్యక్రమం మరోసారి నిర్ధారిస్తున్నట్లు కనిపిస్తోంది.
అల్లు అర్జున్ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అభ్యర్థిగా పోటీ చేసిన శిల్ప రవికి మద్దతుగా ప్రచారం చేశారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా మెగా అభిమానులు పనిగట్టుకుని మరి నెగిటివ్ ప్రచారం చేశారు. సినిమా ప్లాప్ అయిందంటూ పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. మెగా ఫ్యామిలీని కాదనుకుని వెళ్లిన అల్లు అర్జున్ కు తగిన శాస్తి జరిగింది అంటూ పలువురు మెగా సామాజిక అభిమానుల వేదికగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ బయటకు వచ్చిన తర్వాత సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నప్పటికీ మెగా కుటుంబ సభ్యులు మాత్రం పెద్దగా స్పందించలేదు. ఇదే ఇప్పుడు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. అల్లు అర్జున్ పట్ల మెగా కాంపౌండ్ కు ఇంకా ఆగ్రహం తగ్గలేదు. మరికొందరు అల్లు అర్జున్ అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి మరి అల్లు అర్జున్ అరెస్టుకు పవన్ కళ్యాణ్ కారణం అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా అరెస్టు ఘటనతో అల్లు వెర్సెస్ మెగా వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది.
తెలంగాణ నిరుపేదలకు శుభవార్త.. భూమిలేని నిరుపేద కూలీలకు ఆర్థిక సాయం
లిక్కర్ డ్రింకింగ్ | మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలు