- సంధ్య థియేటర్ అంశంలో వీడియో పుటేజ్ ఆధారంగా ప్రశ్నలు
- కొన్నింటికి సమాధానాలు దాటవేసిన అల్లు అర్జున్
- మళ్లీ పిలుస్తామన్న ఏసీపీ
- తప్పకుండా వస్తానన్న బన్నీ
- బౌన్సర్ ఆంటోనీని అరెస్ట్ చేసిన పోలీసులు
- అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పని చేస్తున్నాడు
ముద్ర, సినిమా ప్రతినిధి : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటలకు పైగా విచారణ సాగింది. విచారణ అనంతరం ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం నోటీసులివ్వగా, లీగల్ టీంతో చర్చించిన పోలీసులు మంగళవారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు నిందితులు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత బన్నీ వాసు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. న్యాయవాదులతో కలిసి హాజరైన అల్లు అర్జున్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ విచారించారు. ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో విచారణ జరిగింది. అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో జరిగిన రోజు జరిగిన పరిణామాల ఆధారంగా పోలీసులు ప్రశ్నించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద ఉన్న సాక్ష్యుల నుంచి వివరాలు సేకరించారు. దీని ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించారు.
వీడియో పుటేజ్ ఆధారంగా విచారణ
సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు ఇప్పటికే ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్‌లో ప్రస్తావించిన ఆరా తీశారు. సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును ఇప్పటికే రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు. పుష్ప-2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు సంబంధించిన అనుమతిని పోలీసులు తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ పరిశీలన నాగరాజు చెప్పారా ? లేదా అనే విషయంపైనా అల్లు అర్జున్‌ను నుంచి స్పష్టత తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ యజమాన్యం నుంచి మీకు సమాచారం వచ్చిందా? అందంలో మీరు ప్రిమియర్‌షోకు వచ్చారా? అనే విషయంపైనా ప్రశ్నలు అడిగారు. ఘటన పరిణమాలపై అన్ని కోణాల్లో విచారణ నిర్వహించిన పోలీసులు.. అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్ బౌన్సర్లు వ్యవహారించిన తీరును పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వ్యక్తిగత సిబ్బంది అభిమానులు తోసివేయడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఏమైనా తెలిసిందా..?
తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను తమదైన శైలిలో పోలీసులు కీలక ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్లుగా చూపిస్తున్నారు. మూడున్నర గంటల పాటు వివిధ సమస్యలను ప్రశ్నించారు. పుష్ప ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి ఏం జరిగిందన్న విషయంపైనే పోలీసులు అల్లు అర్జున్ కు సమాధానాలు రాబట్టారు. అల్లు అర్జున్ చెప్పే ప్రతి మాటలను రికార్డు చేశారు. అల్లు అర్జున్ కు ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధించారు.
పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని తెలియదా ?
పోలీసులు సంధ్యా ధియేటర్ కు హీరో, హీరోయిన్ రాకూడదని పక్కాగా సమాచారం ఇచ్చినప్పుడు, థియేటర్ నిర్వాహకులు అదే చిత్రబృందానికి అందించినప్పుడు, పర్మిషన్ లేదనే విషయం తెలిసి కూడా థియేటర్ కు వచ్చారు అంటూ బన్నీకి పోలీసులు ప్రశ్నలు సంధించారు. పైగా రోడ్ షో ఎందుకు చేశారనే ప్రశ్న ఎదురైంది. దీనికి అల్లు అర్జున్ తనకు అనుమతి లేదన్న విషయం తెలియదని చెప్పినట్లుగా. పోలీసులే రూట్ క్లియర్ చేయడంతో అనుమతి ఉందనుకున్నానని ఆయన చెప్పినట్లుగా లీకు అయింది. రేవతి చనిపోయిందన్న విషయం పై రెండో పోలీసులు అడిగినట్లుగా ప్రశ్న. రేవతి తొక్కిసలాటలో మృతి చెందిందన్న విషయం తెలుసా అని అడిగితే అల్లు అర్జున్ తెలుసు.. కానీ తర్వాత రోజు తనకు తెలిసింది అని చెప్పినట్లు పోలీసుల సిబ్బంది.
థియేటర్ లో పోలీసులు కలవలేదు
రేవతి చనిపోయిందని, ఆమె బాబు చావు బతుకుల్లో ఉన్నాడని, వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ, డీసీపీ మీ వద్దకు చెప్పారా అనే ప్రశ్న అల్లు అర్జున్ ను పోలీసులు విచారణలో అడిగారు. దీనికి సమాధానంగా తన వద్దకు ఏ పోలీసులు రాలేదని, తనకేం చెప్పలేదని, మీడియాకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారని తాను ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయానికే అర్జున్ కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. సంధ్య వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు చెబుతున్న దానికి అల్లు అర్జున్ చెబుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉండటంతో మళ్లీ విచారణ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. తొక్కిసలాటకు సంబంధించిన 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కు చూపించి పోలీసుల ఇంటరాగేషన్ చాలా గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పిన అల్లు అర్జున్.. పలు కీలక ప్రశ్నలకు మాత్రం నోరు మెదపలేదని పోలీసులు తెలిపారు. వైసీపీ, డీసీపీ మీకు ఆడిటోరియంలో కలిసారా? అనే ప్రశ్నకు.. వాళ్ళు ఎవరూ నన్ను కలవలేదంటూ సమాధానం ఇచ్చినట్లు తేలింది.
కాగా, అర్జున్ తరపు లాయర్ల బృందం కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే ఒక్క లాయర్ ను మాత్రం అర్జున్ ను ప్రశ్నిస్తున్న రూంకు దూరంగా ఉండి చూసేందుకు అనుమతి ఇచ్చారు. కేవలం అబ్జర్వేషన్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు..దానికి అర్జున్ ఇచ్చిన సమాధానాలపై ఆయన లీగల్ టీం రివ్యూ చేసి ఏమైనా కొత్త అభియోగాలు మోపేందుకు అవకాశం ఇచ్చామా అన్న అంశంపై పరిశీలన చేసి తదుపరి వ్యూహం ఖరారు చేసుకునే అవకాశం ఉంది. దిగువ కోర్టులో బెయిల్ కోసం అల్లు అర్జున్ హైకోర్టు పిటిషన్ వేయాల్సి ఉంది.
ఎప్పుడు పిలిచినా వస్తా
ఏసీపీ రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో జరిగిన విచారణ సందర్భంగా అల్లు అర్జున్ నుంచి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అవసరమైతే మరోసారి అల్లు అర్జున్ విచారణకు రావాలని, తప్పకుండా వస్తానని, పోలీసుల విచారణకు సహకరిస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. అయితే, విచారణకు ముందు లీగల్ టీమ్‌తో సంప్రదింపులు చేశారు. సోమవారం నోటీసులు అందగానే.. పోలీసుల నోటీసులపై అల్లు అర్జున్ తన లీగల్ టీం తో చర్చలు జరిపారు. కాగా, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు దాదాపు మూడున్నర గంటల విచారణ తర్వాత అల్లు అర్జున్ తిరిగి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి 200 మీటర్ల ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు.
బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్
అర్జున్ ను ఓ వైపు ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన బౌన్సర్ల టీం లీడర్ అయిన ఆంటోనిని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా ధియేటర్ లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిబంధనల ప్రకారం బౌన్సర్లను నియమించారా? లేదా అనే అంశంపైనా అల్లు అర్జున్ నుంచి వివరాలు రాబట్టారు. ఈ కేసులో మరికొంత మందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ నిర్వహించాలని కోరారు. విచారణ జరుగుతుండగానే.. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ ఆంటోని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బౌన్సర్‌లకు ఆంటోని ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నప్పుడు ఆ రోజు వారి అత్యుత్సాహం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో ఎక్కడా ఈవెంట్ జరిగినా ఆంటోని బౌన్సర్లను ఆర్గనైజ్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ తేదీ డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఆంటోనీ బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా థియోటర్ దగ్గర సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి.. సంధ్య థియేటర్‌కి ఆ రోజు ఏం జరిగింది? అన్న వివరాలు రాబట్టారని. -ఆంటోనీతో సీన్‌రీ కన్‌స్ట్రక్షన్ చేయించిన పోలీసులు.. తొక్కిసలాటకు ఇతనే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. పోలీసులతో కూడా అంటోనీ దురుసుగా ప్రవర్తించినట్లు తేలింది. దాదాపు 50 మందికి పైగా బౌన్సర్లతో అల్లు అర్జున్ సంధ్య థియేటర్లోకి ప్రవేశించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బౌన్సర్లు చాలా సేపటి వరకు అల్లు అర్జున్ వద్దకు పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నట్లు ఉన్నాయి. ఏకంగా పోలీసులనే కొందరు బౌన్సర్లు నెట్టేశారు.