7
డిసెంబర్ 4న పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన కేసులో మధ్యంతర బెయిల్ తో బయట ఉన్న అల్లు అర్జున్ కి రీసెంట్ గా నాంపల్లి కోర్టు 50 వేల రూపాయలు, ఇద్దరి సాక్ష్య సంతకాలతో సాధారణ బెయిల్ ని ఇస్తూ తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. .
దీంతో అల్లు అర్జున్(Allu arjun)ఈ రోజు నాంపల్లి కోర్టుకు వెళ్లి బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు.శనివారం కాబట్టి లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్లడం జరిగింది.ఇక అల్లు అర్జున్ కి ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసులు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా కోర్టులో తెలియజేసింది.