అల్లుఅర్జున్(అల్లు అర్జున్)సుకుమార్(సుకుమార్)కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2(పుష్ప 2),ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలైన విషయం తెలిసిందే.నిన్న ప్రీమియర్ షోలు కూడా వెయ్యడంతో అందులో భాగంగా అల్లు అర్జున్ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి వెళ్లడం జరిగింది.ఈ సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే వివాహిత చనిపోవడంతో పాటుగా, ఆమె కొడుకు హాస్పిటల్ లో క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు.
ఇప్పుడు ఈ విషయంపై పిడిఎస్ యు(పిడిసు)ప్రోగ్రసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ కమిటీ సూచనూ,పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ దానికి బాధ్యత వహిస్తూ ప్రీమియర్ షో కి వచ్చి తొక్కిసలాటకి కారణమయ్యాడు.ఫలితంగా ఒక మహిళ తన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.ఆ చనిపోయిన మహిళ హాస్పిటల్ కొడుకు చావు. బతుకుల మధ్య ఉన్నాడు.సినిమా అనేది వినోదాన్ని పంచే విధంగా ఉండాలి గాని, విషాదాన్ని పంచకూడదు.ప్రజా సమస్యలు పై పోరాడుతున్నప్పుడు పరిమితికి మించిన జనం ఉండరాదని కండిషన్స్ పెట్టే ప్రభుత్వం, మరి అర్ధరాత్రి ఒక హీరో తన స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు ఆహ్వానించారు.
సినిమా మీద విపరీతమైన హైప్ ని పెంచి టికెట్ రేట్స్ ని పెంచి ప్రజల డబ్బుని దోచేస్తున్నారు. రైతులకి మద్దతు ధర కల్పించని పాలకులు,పెట్టుబడి దారులు సినిమా తీస్తే మాత్రం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు.విద్యార్థులు, యువకులు వారి కపటనీతిని గమనించాలి.ఇక మహిళ చావుకి కారణమైన అల్లు అర్జున్ హీరో కాదు జీరో.అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, లేదా 2 ప్రదర్శనను అడ్డుకుంటామని పిడిఎస్ యు సంస్థ అధికారంలో ఉంది. లెటర్ పాడ్ ని కూడా విడుదల చేయడం జరిగింది.