- ఈరోజు ఉదయం 11 గంటలకు పీఎస్ రావాలని నోటీసులో చిక్కడపల్లి పోలీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసులాట ఘటనలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులు పోలీసులు గుర్తించారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కి సలాటలో ఒకరికి భిన్నంగా మరొక పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు నుంచి నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను అల్లు అర్జున్ పొందారు. అయితే అల్లు అర్జున్ జరుగుతోంది సాక్షులు, పిటిషనర్ ను ప్రభావితం చేయగల వ్యక్తి అని, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కేసు విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వొద్దని, మధ్యంతర బెయిల్ రద్దు చేయడానికి పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందనే చర్చ.
మధ్యంతర బెయిల్‌పై ఉన్నప్పుడు కేసు గురించి మీడియా ముందు మాట్లాడకూడదనే షరతులు.. కోర్టు షరతులను అల్లు అర్జున్ ఉల్లంఘించాలనే వాదనను ప్రభుత్వం తరపున న్యాయవాదులు వినిపించే అవకాశం ఉంది. దీంతో అల్లు అర్జున్ మధ్య బెయిల్ రద్దవుతుందా? లేకపోతే కోర్టు బెయిల్‌ను పొడిగించేది చర్చానీయంశంగా మారింది. మరోపక్క అల్లు అర్జున్ కేసు అంశం క్రమీణ రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా ఈ ఘటన మారిపోవడం. అల్లు అర్జున్ వ్యవహారాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతుండగా, అల్లు అర్జున్ ను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.