పుష్ప2 చిత్రం విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించిన చర్చ శనివారం అసెంబ్లీలో జరిగింది. చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈ పరిశీలన లేవనెత్తి ఘటన జరిగిన విధానం గురించి వివరించి తనకు స్పష్టత ఇవ్వాలని. అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని స్పీకర్. ఇప్పటివరకు ఈ ఘటన గురించి, దాని పూర్వాపరాల గురించి రేవంత్‌రెడ్డి ఒక్కసారిగా కూడా మాట్లాడలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాత్రమే చట్టం తన పని చేసుకుపోతుంది అని అన్నారు.
మొదటిసారి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. 'ఈ విషయం అసెంబ్లీలో చర్చకు వస్తుందని నేననుకోలేదు. కానీ, సభ్యులు లేవనెత్తిన అంశం గురించి మేం కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. డిసెంబర్ 2న సంధ్య థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు ఒక లేఖ రాసింది. డిసెంబర్ 4న పుష్ప2 సినిమాకి సంబంధించి హీరో, హీరోయిన్లతోపాటు యూనిట్ సభ్యులు వస్తున్నారు. అక్కడ భద్రత కల్పించాల్సిందిగా థియేటర్ యాజమాన్యం కోరింది. కానీ, అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా భద్రత కల్పించడం కుదరదు అని డిసెంబర్ మూడున అధికారికంగా పోలీస్ శాఖ థియేటర్‌కి ఒక లెటర్ ఇచ్చింది. అయినా దాన్ని పట్టించుకోకుండా డిసెంబర్ 4 రాత్రి సంధ్య థియేటర్‌కి వచ్చారు హీరో. థియేటర్‌కి రావడాని కంటే ముందే కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ థియేటర్ దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ వేలకొద్దీ క్రౌడ్ ఉంది. హీరోని చూసి జనం ఒక్కసారి ఎగ నటించారు. హీరో పర్సనల్ సెక్యూరిటీ జనాన్ని వెనక్కి నెట్టేసి హీరోని థియేటర్లోకి తీసుకెళ్లిపోయారు.
అప్పుడు పోలీసులు జనాన్ని చెదరగొట్టినపుడు ఒక మహిళ, ఒక బాబు కింద పడిపోయి ఉండడాన్ని గమనించారు. తల్లి చనిపోయినా కూడా తన కొడుకు చేతిని గట్టిగానే పట్టుకొని ఉండడాన్ని పోలీసులు గమనించారు. బలవంతంగా ఆ చేతిని విడిపించి ప్రాథమిక చికిత్స చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి. అప్పటికే ఆ మహిళ చనిపోయింది. ఆ అబ్బాయి ఊపిరి అందక స్పృహ కోల్పోవడంతో బ్రెయిన్ డెడ్ అయింది. థియేటర్ బయట ఇంత జరుగుతున్నప్పటికీ హీరో మాత్రం సినిమా చూస్తున్నాడు. పోలీస్ అధికారులు ఆయన దగ్గరకు వెళ్లి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతేనే థియేటర్ దగ్గర క్రౌడ్ కంట్రోల్ అవుతుందని చెప్పారు. కానీ, దానికి హీరో ఒప్పుకోలేదు. సినిమా చూసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళతానని చెప్పారు. దాంతో డీసీపీ వచ్చి థియేటర్ నుంచి మీరు వెళ్లిపోతేనే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది అని చెప్పడంతో అక్కడి నుంచి బయల్దేరారు హీరో. వెళ్తున్నప్పుడు కూడా రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందర్నీ విష్ చేస్తూ రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. ఇలాంటి మనిషి గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏమీ అనకుండా ఉండలేని పరిస్థితి. ఆ హీరోని చూసిన తర్వాత ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉన్నారని అర్థమవుతోంది.
అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తే మిగిలిన పార్టీల వాళ్ళు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. అతను కొన్ని గంటలు జైలులో ఉండి వచ్చినందుకు సినిమా ఇండస్ట్రీ మొత్తం అతన్ని కలిసారు. అతనికేమైంది కన్నుపోయిందా, కాలుపోయిందా? ఇక్కడ ఒక మహిళ చనిపోయింది. 9 ఏళ్ళ కుర్రాడు కోమాలో ఉన్నాడు. అతన్ని చూసేందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా ఎందుకు రాలేదు. ఆఖరికి ఆ సినిమా హీరోగా డైరెక్టర్, ‘గానీ, ప్రొడ్యూసర్లు కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ కుర్రాడ్ని చూసేందుకు రాలేదు. ఇదెక్కడి మానవత్వం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో నాకు తెలీదు. సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలన్న ఉద్దేశంతో వారికి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చాం. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాం. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి. అలాగే బెనిఫిట్ షోలు కూడా ఇకపై ఉండవు. నేను సీఎంగా ఉన్నంతకాలం అది జరగని పని. నాకు తెలంగాణ ప్రజల క్షేమం ముఖ్యం. వారికి ఏదైనా ఆపద తలపెడితే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు' అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.