6
రాంగోపాల్‌పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసు జారీ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి ముందుగానే నోటీసు పంపారు. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు తాజాగా ఈ నోటీసు జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అతని మేనేజర్ మూర్తికి నోటీసు అందించారు. తమ సూచనలు పాటించాలని, అక్కడ ఏదైనా ఘటన జరిగితే పూర్తి బాధ్యత అల్లు అర్జున్ హాస్పిటల్ వహించాల్సి ఉంటుందని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. మరి సూచన అల్లు అర్జున్ ఎలా సూచిస్తారో చూడాలి.