Home సినిమా అల్లు అర్జున్‌కి పబ్లిసిటీ కంటే… ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యం! – Prajapalana News

అల్లు అర్జున్‌కి పబ్లిసిటీ కంటే… ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యం! – Prajapalana News

by Prajapalana
0 comments
అల్లు అర్జున్‌కి పబ్లిసిటీ కంటే... ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యం!


అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ మూవీ పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అంతకుముందు రోజు ప్రీమియర్స్‌ వేసిన సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన విషాద ఘటన అందర్నీ కలచి వేసింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి గత 13 రోజులుగా కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పుష్ప2 యూనిట్ విచారాన్ని వ్యక్తం చేసింది. మృతి చెందిన రేవతి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేసింది. అంతేకాదు, తమ సినిమా వల్ల నష్టపోయిన కుటుంబానికి తనవంతు సాయంగా అల్లు అర్జున్ రూ.25లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఘటన జరిగి 13 రోజులు గడిచినా ఇప్పటివరకు అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు, కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ని కూడా చూసేందుకు వెళ్ళలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి కొన్ని మీడియా సంస్థలు పదే పదే ప్రస్తావించడం వెనుక అల్లు అర్జున్‌లో ఫ్యాన్స్‌ హస్తం వార్తలు వినిపిస్తున్నాయి. కావాలనే ఇలాంటి ప్రచారాలు వినిపిస్తున్న బన్నీ ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు.

అల్లు అర్జున్… వారిని పరామర్శించడానికి వెళ్లకపోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే తాను థియేటర్‌కి వెళ్ళడం వల్ల ఈ అనర్థం కలవడం లేదు, ఇప్పుడు ఆ కుటుంబాన్ని వెళ్లినా, ఆ చిన్నారిని పలకరించేందుకు వెళ్లినా అక్కడ మళ్లీ ఫ్యాన్స్‌లో ఎక్కువ అవుతుందని, ఇంతకుముందు మళ్లీ థియేటర్‌లో జరిగిన దుర్ఘటన మళ్లీ జరగకూడదనే వారు కనిపించడం లేదు. వారిని కలవడం తమకు ముఖ్యమని బన్నీ కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తను ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబానికి, ఆ బాలుడికి తనవంతు సాయం చేస్తున్నారు. అతని వైద్యం కోసం ఇప్పటివరకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. ఆ కలిగి తనే భరించారు. శ్రీతేజ్‌కి మెరుగైన వైద్యం సింగపూర్‌ నుంచి కూడా ఖరీదైన ఇంజెక్షన్‌ తెప్పించిన విషయం తెలిసిందే.

రేవతి కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని, అయినా అల్లు అర్జున్ తనవంతు సాయం ఉందని బన్నీ అభిమానులు చెబుతున్నారు. ఇదంతా చేస్తోంది పబ్లిసిటీ కోసం కాదని, ఒక బాధ్యతగా ఫీల్‌ అయిందని అంటున్నారు. పబ్లిసిటీ కోసమే అయితే ఇప్పటికే ఆ బాలుడితో లేదా ఆ కుటుంబంతో ఓ ఫోటో దిగి మీడియాకి ఇచ్చేవారు. కానీ, అలా చేయలేదు. నిజానికి అల్లు అర్జున్ పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదు. అందుకే సైలెంట్‌గా తను చేయాల్సిన సాయం ఉందని అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ అయిన సందర్భంగా తను పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటానని బాలుడి తండ్రి భాస్కర్‌ మీడియా ముఖంగా చెప్పినప్పుడే వారికి బన్నీ ఎంత సిన్సియర్‌గా సాయం చేస్తున్నారనే విషయం అర్థమవుతోందని అంటున్నారు.

ఇక అల్లు అర్జున్‌ జైలులో కొన్ని గంటలు గడిపి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి పలకరించి వచ్చారు. వాటిలో కూడా ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు, చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ని చూసేందుకు కూడా వెళ్ళలేదు. కానీ, అల్లు అర్జున్‌ జైలు నుంచి రాగానే ప్రముఖులంతా క్యూ కట్టారు అంటూ రకరకాల విమర్శలు మీడియాలో వినిపించాయి. వాటిని కూడా అభిమానులు చూస్తున్నారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు అల్లు అర్జున్‌పై ఉన్న జాలితో వారు కలవలేదు అంటున్నారు. అతని క్యారెక్టర్‌పై వారందరికీ ఉన్న గౌరవం, ఆయన ఆలోచన, ఆచరణపై ఉన్న నమ్మకంతోనే కలిశారని చెప్పారు. అంతేకాదు, అల్లు అర్జున్ తత్వాన్ని నమ్మి తామంతా మీకు అండగా ఉన్నామని సంఫీవు తెలిపేందుకే వెళ్లి కలిశారు తప్ప మరో ఉద్దేశంతో కాదని బన్నీ అభిమానులు స్పష్టం చేస్తున్నారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech