Home తాజా వార్తలు అల్లుడి కంపెనీ కోసమే ఫార్మాసిటీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

అల్లుడి కంపెనీ కోసమే ఫార్మాసిటీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
అల్లుడి కంపెనీ కోసమే ఫార్మాసిటీ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • రేవంత్ పదవి తుమ్మతే ఊడిపోయే ముక్కు
  • సీఎంకు రియల్ ఎస్టేట్, బ్యాగుల ఫార్మా మాత్రమే తెలుసు
  • ఆయనకు ఈ రేస్ అంటే తెలియదు
  • రైతులపై దాడి చేస్తున్నారు
  • పోలీసులు.. రేవంత్ సైన్యంలా పని చేస్తున్నారు
  • రైతులపై దాడిని జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ దగ్గరకు తీసుకుపోతాం
  • కొడంగల్ నుంచే సీఎం భరతం పడుతాం
  • పట్నం నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడం ఒక కుట్ర
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అల్లుడి కంపెనీ కోసమే ఫార్మా పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిని అడ్డం పెట్టుకుని రేవంత్ భూదందాకు తెరలేపాడని. కానీ తుమ్మితే ఊడిపోయే పదవి రేవంత్ ది అని కేటీఆర్ సెటైర్లు వేశారు.

బుధవారం నగరంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. వారు ధైర్యంగా ఉండాలని పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్‌తో కొడంగల్ రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు చిత్రహింసలకు గురి చేశారన్నారు. అరెస్టు చేసిన రైతులకు మెడికో లీగల్ వెంటనే పరీక్షలు చేయాలి.. ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కోడంగల్ లో ఫార్మా విలేజ్ వద్దని రైతులు సీఎం ను, బీఆర్ఎస్, బీజేపీ వాళ్లను కూడా కలిశారన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగానే కొడంగల్ ప్రాంతం ఆందోళనలు, నిరసనలతో రగలిపోతోంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాలోచిత నిర్ణయాలే కారణమన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించిన చందంగా ఉంది…రేవంత్ సర్కార్ తీరు అని మండిపడ్డాడు.

సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లాడన్నాడు. జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరిస్తూ ఇక్కడ పాలన గాలికి వదిలేశాడని కేటీఆర్ తెలిపారు. అని ప్రశ్నించారు. భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, పేద బీసీల భూములను రేవంత్ రెడ్డి తన అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం ఇతరుల కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొడంగల్ నుంచే రేవంత్ భరతం పడతాం

రేవంత్ రెడ్డి భరతం పట్టే పనిని కొండగల్ నుంచే పెడతామని కేటీఆర్ తెలియజేసారు.రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే….ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చని అన్నారు.అధికార మదంతో విర్రవీగుతున్న నియంత రేవంత్‌కు కొడంగల్‌లో కూడా తిరగలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన లగచర్ల రైతులు ఎవరూ భయపడొద్దని.. వారికి అండగా తాముంటామన్నారు. పార్టీతో కలిసి తాను లగచర్లకు వెళ్తామన్నారు. ఎవరు అడ్డువస్తారో చూస్తామన్నారు.

పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణను కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని చెప్పారు. కానీ వార్డు సభ్యుడు కూడా కానీ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మాత్రం లగచర్లకు 300 మందితో ఎలా వెళ్లనిచ్చారని ప్రశ్నించారు. ఆయన తన అనుచరులతో స్వైర విహారం చేస్తూ ప్రజలను బెదిరింపులకు ప్రదర్శించారు కేటీఆర్. భూమిని కోల్పోతున్నామని బాధపడుతున్న గిరిజన, దళిత, బీసీ రైతులను జైళ్లలో పెట్టి వాళ్లను కొడుతూ చిత్రహింసలు పెట్టిన నికృష్ట ప్రభుత్వం రేవంత్ ది అని కనిపించింది. ఒక ఇంట్లో మహిళ ఛాతిపై కాలితో తొక్కి ఆ మహిళ భర్తను అరెస్ట్ చేసినట్లు వివరించారు. 'గతంలో ఏ నియంత.. అప్రజాస్వామిక పాలకుడు కూడా చేయని దుర్మార్గ వ్యవహారం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో చేస్తున్నాడని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ దుర్మార్గాలపై న్యాయ పోరాటం

రేవంత్ చేస్తున్న దుర్మర్గాలపై న్యాయపోరాటం అని కేటీఆర్ తెలిపారు. ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటాం. దీని కోసం ఎంత దూరమైన పోతామన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అనసవరంగా అగ్నిగుండం చేయవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా సీఎం ఆనాలోచిత నిర్ణయాలను మానుకోవాలని సూచించారు. ఫార్మా

నిర్ణయాన్ని ఇకనైనా వెనక్కి తీసుకోవాలన్నారు. ఫార్మా సిటీ విషయంలో రేవంత్ సర్కార్ హైకోర్టును కూడా మోసం చేస్తోందన్నారు. బయట ఫార్మా సిటీ రద్దు అంటున్నారు. కోర్టులో మాత్రం ఫార్మా సిటీ ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములు వేరే అవసరాలకు వాడటానికి వీలుగా అందుబాటులో ఉన్నాయి. ఫార్మా సిటీ పేరుతో ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. అవసరం లేని చోట కూడా భూములు కొని రోడ్లు వేస్తూ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీల బాగోతాన్ని ధారావాహిక మాదిరిగానే బయటపెడుతూనే ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు.ముఖ్యమంత్రి కిరియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగ్ ల ఫార్ములా మాత్రమే తెలుసు.ఆయనకు ఈ రేస్ అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు.

11 నెలలుగా రోజుకో కుంభకోణం పేరుతో రేవంత్ టైం పాస్ ప్రచారం ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech