పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలవడానికి కారణమయ్యాడనే కారణంతో అల్లు అర్జున్ ని ఆయన ఇంటి దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పీఎస్ కి తరలించారు.
??క్కడపల్లి పీఎస్ కి తరలించిన విషయం తెలిసిందే.
పిఎస్ లో అల్లు అర్జున్(అల్లు అర్జున్)ని సెంట్రల్ జోన్ డిసిపి విచారించగా,ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీంతో అల్లుఅర్జున్ ని కోర్టుకి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఇక ఈ కేసు సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదని అల్లు అర్జున్ తరుపు లాయర్లు వేసిన పిటిషన్ పై మరికాసేపట్లో తీర్పు రానుంది. అల్లు అర్జున్ కోసం సినీ పరిశ్రమకు చెందిన వారు చేరుకుంటున్నారు. ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు(dil raju)కూడా అక్కడ వెయిట్ చేస్తున్న వారిలో ఉన్నారు.