శివ కార్తికేయన్(siva karthikeyan)సాయిపల్లవి(sai pallavi)జంటగా దివాళి కానుకగా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా విడుదలైన మూవీ అమరన్.దివంగత మేజర్ ముకుందన్ వరదరాజన్(major mukund varadarajan)జీవిత కథ ఆదరంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తో ముందుకు పోతుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుంది.
వీకెండ్ లోపే వంద కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ లాంగ్ రన్లో రెండు వందల కోట్ల మార్క్ అని అందుకుంది.పైగా ఓవర్సీస్లో ఈ చిత్రం ద్వారా శివ కార్తికేయన్ రేర్ ఫీట్ అందుకుంది.ఇంత వరకు తన కెరీర్లో మిలియన్ డాలర్ క్లబ్బులోకి జాయిన్ అయిన మూవీ లేదు. కానీ అమరన్ ఈ ఫీట్‌ను కేవలం నాలుగైదు రోజుల్లోనే సాధించేసింది.దీంతో శివ కార్తికేయన్ యూఎస్ మార్కెట్ ఇప్పుడు అమాంతం పెరిగిందని చెప్పవచ్చు.
హీరో కమల్ హాసన్ నిర్మించిన ఈ అగ్ర చిత్రం రాజ్ కుమార్ పెరియ స్వామి(raj kumar periyaswamy) దర్శకత్వం వహించగా భువన్ అరోరా, రాహుల్ బోస్,శ్యాం మోహన్, సురేష్ చక్రవర్తి ముఖ్య పాత్రలు పోషించారు. జి వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.సాయి ఫోటోగ్రాఫ్ ని అందించాడు.