Home తెలంగాణ అబద్దాల టెక్నిక్ తో రుణమాఫీ చేశారా? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

అబద్దాల టెక్నిక్ తో రుణమాఫీ చేశారా? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
అబద్దాల టెక్నిక్ తో రుణమాఫీ చేశారా? - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • 40 శాతం రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు
  • ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :-రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ అని జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ పై బీఆర్ఎస్ – వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ ఇచ్చిన ప్రకటనలో ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఐఐ) రూపొందించిన వాడారో…రుణమాఫీ జరిగిన రైతుల లెక్కల విషయంలో మీ ముఖ్యమంత్రి (ఏఐ) టెక్నిక్ వాడారంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి 40 లక్షల మంది రైతులు అనే సంఖ్య (అనుముల ఇంటెలిజెన్స్) అంటే రేవంత్ రెడ్డి వాడిన అబద్దాల (EI) టెక్నిక్ తో రూపొందించిందేనని ఎద్దేవా చేశారు.

నిజానికి తెలంగాణలో ఇప్పటి వరకు రైతు రుణాలు 40 శాతం కూడా మాఫీ కాలేదని చెప్పారు. కానీ తరుచూ నిబంధనలు మారుస్తూ రుణమాఫీ తేదీలు మారుస్తున్నారని కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామంలోనూ, నియోజకవర్గంలోనూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారు. రుణమాఫీ విషయంలో నిబంధనలు, తేదీలు మారుతున్నప్పటికీ…ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అబద్ధాలు, బూటకపు ప్రచారాలు మాత్రమే నిత్యం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech