27
ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి పట్టణంలోని అన్ని వార్డులలో డ్రైడే కార్యక్రమం నిర్వహించడంతోపాటు జిల్లా అదనపు కలెక్టర్ కె. గంగాధర్ అన్నారు. స్థానిక సర్దార్ నగర్ కాలనీలో ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రామాంజుల రెడ్డితో కలిసి పరిసరాలలో నిల్వ ఉన్న మురికి నీటిలో దోమల నివారణ కొరకు ఆయిల్ బాల్స్ ను వేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని అన్ని వార్డులలో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుందని, ప్రజలందరూ అప్రమత్తమై దోమలు వ్యాప్తి చెందకుండా నిల్వ ఉన్న నీటి పాత్రలు అనగా కూలర్లలో, కొబ్బరి చిప్పలలో, పూల కుండీలలో, టైర్లలో, గుంతలలో ఉన్న నీటిని శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లమాస వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.