డెవోషనల్ న్యూస్, ఈవార్తలు : హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో రత్నగిరి కొండపై ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది. కొత్తగా పెళ్లయిన జంటలు తప్పక సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్లలో కంటే.. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో వ్రతం చేసుకునేందుకు భక్తులు ఎక్కువగా ఇష్టపడతారు. రత్నగిరి సత్రం, దేవస్థానం ఫలహారశాల దాటగానే ఆలయ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంతదూరం నడిస్తే సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది. సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపు రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపు కల్యాణ మంటపం ఉంటాయి. రామాలయం పక్కనే వ్రతాల మంటపాలు, భోజనశాల ఉంటాయి. గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉంటాయి. గుడి వెనుక గుట్ట మీద అనేక కాటేజ్‌లు ఉంటాయి. సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది. ఆధ్యాత్మికత శరీరాన్ని తాకుతుంది. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటాయి.
స్థల పురాణం: పూర్వం అనరాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు. దాంతో అనరాజు రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అడవికి వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ రత్నగిరి కొండను చేరాడు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించాడు. అనరాజు భక్తికి స్వామి సంతోషించాడు. రాజుకు కలలో కనిపించి 'బాధ పడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది' అని చెప్పి సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతారణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఉండూరు సంస్థాన అధిపతికి.. రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టాలని, దానివల్ల మేలు జరుగుతుందని కల వస్తుంది. ఆ అధికారి తనకు ఆ కల రావడంలో ఆంతర్యం ఏమిటని అనుకుని, వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండ మీదికి వెళ్లాడు. ఆశ్చర్యకరంగా కొండ మీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్సనమిచ్చింది. వెంటనే.. రత్నగిరి కొండపై ఆలయం కట్టించాడు. తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించాడు. అదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం. ఓం నమో సత్యదేవాయ ప్రభావం
ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
దేవుని గుడిలో ప్రదక్షిణలు చేశాక చేయాల్సిన పనులు ఇవే..