44
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మథ గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు సంగెం సురేష్, దీక్షిత్ లు కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సంగెం సురేష్ తన స్వగ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి జిల్లా కుచలాపూర్ కు వెళ్లారు.
బుధవారం ఉదయం విధులు నిర్వహించేందుకు తిరిగి వస్తున్నారు. ఈ భైంసా రహదారిపై నర్సాపూర్ – జి మండలం తురాటి గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొన్నది. ఈ ఘటనలో దీక్షిత్ ( 7) సంఘటన స్థలంలో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ సురేష్ (27) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య, కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మన్మథలో విషాద ఛాయలు అలముకున్నాయి.