అక్కినేని(akkineni)కుటుంబానికి,చిరంజీవి(chiranjeevi)కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికి తెలుసు.మహా నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు(akkineni nageswararao)మొదలుకొని నేటి అఖిల్ వరకు కూడా ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఉంది.ఈ విషయాన్నీచాలా జరిగినప్పుడు ఇరువురి కుటుంబ సభ్యులు బహిరంగంగానే చెప్పారు. నాగార్జున(nagarjuna) కూడా చిరంజీవిని అన్నయ్య అని సంబోదిస్తాడు.
రీసెంట్ గా తెలంగాణ దేవాదాయశాఖ కొండా సురేఖ(konda surekha)బిఆర్ఎస్ ఎంఎల్ఏ కేటీఆర్ పై విమర్శలు చేస్తూ నాగచైతన్య(naga chaitanya)సమంత(samantha)ని ఉద్దేశించి లేని పోనీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే చాలా బాధపడ్డాను.సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు. మా సభ్యులపై చేసిన ఇలాంటి దుర్మార్గపు మాటలని అందరం కలిసి వ్యతిరేకిస్తాం.సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు. సమాజాన్ని ఉద్దరించడానికి నాయకులను ఎన్నుకుంటాం.కానీ ఇలాంటి ప్రసంగాలు చేసి ఆ విషయాన్నీ కలుషితంగా మార్చకూడదు. రాజకీయ నాయకులు, గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు మంచి ఉదాహరణగా ఉండాలి.ఈ హానికరమైన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పాడు.
చిరు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా నిలవకుండా సురేఖ భర్త ప్రముఖ రాజకీయనాయకుడు కొండ మురళి(కొండ మురళి)చిరు తో ఈ విషయంపై మాట్లాడాడా అనే చర్చ మొదలైంది.ఎందుకంటే ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తం అక్కినేని కుటుంబానికి అండగా నిలుస్తూ కొండ సురేఖ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే చిరంజీవి తో కొండ మురళి భేటీ అవ్వచ్చనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.చిరు గతంలో కాంగ్రెస్ నాయకుడుగా చేసిన విషయాన్నీ కూడా గుర్తు చేస్తున్నారు.