34
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) కుమార్తె గాయత్రి ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే కూతురు కన్నుమూయడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన రాజేంద్రప్రసాద్ ని పరామర్శించారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (ప్రభాస్) కూడా రాజేంద్రప్రసాద్ ఇంటికెళ్లి ఆయనను పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడి ఓదార్చారు.
కాగా ప్రభాస్-రాజేంద్రప్రసాద్ మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రభాస్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD'లో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.