36
ముద్ర. వీపనగండ్ల :- సోమశిల గ్రామానికి చెందిన స్పిరిచ్యువల్ – వెల్నెస్ “కేటగిరీలో జాతీయ అవార్డు పొందిన నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ జాతీయ అవార్డును ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సోమవారం బహుకరించారు.
ఈ సందర్భంగా జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి జూపల్లి ఆకాంక్షిస్తూ నరసింహ ను ఆశీర్వదించారు. జీవితంలో మైలు రాయిగా నిలిచిపోయేటటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు కల్పించినందుకు మంత్రి జూపల్లి నరసింహారావు ఆశీర్వాదం తీసుకురావడం కల్వరాల సంతోషం వ్యక్తం చేశారు.