31
భూదాన్ పోచంపల్లి, ముద్ర; గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు మృతి చెందాడు.ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జిబ్లక్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన పబ్బతిగాని ప్రవీణ్ (27) మంగళవారం కలిసి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చెరువులోకి దిగారు.
ఈ ముగ్గురు స్నేహితులు ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న ప్రదేశంలో జారి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఇద్దరిని బయటకు లాగారు .ప్రవీణ్ కు ఈత రా కనిపించకుండా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.