34
- మంత్రి పొన్నం ప్రభాకర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆయన్ను అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు పొన్నం ప్రభాకర్ కు వేదాశీర్వచనం చేశారు. అనంతరం పొన్నం ప్రబాకర్ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం ఎంతో సంతోషదాయకం అన్నారు. కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదన్న ఆయన ప్రతీ 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ ఉంటారని చెప్పారు. కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలని అన్నారు. కులగణన మీద అందరూ పలు విధాలుగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలపై ఉన్నారు.