34
ముద్ర,హైదరాబాద్:- పార్లమెంట్ ఎన్నికల వేళ బహిరంగ సభలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లోని హసన్‌నగర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బహిరంగ సభ జరుగుతుండగానే కాంగ్రెస్ నాయకుడు మక్బూల్‌ను కొందరు దుండగులు తరుముకుంటూ వెళ్లి, వెంటాడి మరీ అందరూ చూస్తుండగానే దారుణంగా గొంతు కోసి హత్య చేశారు.
దుండగులు వెంటాడటాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.