44
ఇటీవల: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. అయిదు సంవత్సరాల తరువాత ప్రధాని మోదీ రష్యాలో ఉంటారు. ఈ నెల 8, 9వ తేదీల్లో రష్యాలో ఆయన ఉండనున్నారు. 22వ భారత్-రశ్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్ తో పాటు మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరపనున్నాయి. రష్యా పర్యటన ముగించుకున్నాక మోదీ ఆస్ట్రియా దేశంలో పర్యటిస్తారని. గత 41 సంవత్సరాల్లో ఆస్ట్రియాను భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి. రష్యాలో చివరిసారిగా మోదీ 2019లో వ్లాడివోస్టాక్ పట్టణంలో ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు.