జాతీయ- అంతర్జాతీయ

2020 నాటికి జియో ఐవోటీ సేవలు

రిలయన్స్‌ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం కీలక నిర్ణయం…

‘న్యూ ఇండియా-న్యూ రిలయన్స్’ నినాదంతో తాము ముందుకు పోతున్నామని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ముంబైలోని బిర్లా మాతుశ్రీ సభానగర్ లో ఈరోజు రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు. వినియోగదారులకు ప్రత్యక్షంగా సేవలు అందించే ‘కన్జ్యూమర్ బిజినెస్’లో రిలయన్స్ విజయం సాధించలేదని చాలామంది గతంలో అన్నారని అంబానీ తెలిపారు. కానీ అలాంటి అన్ని విమర్శలను రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ లతో వాటిని తిప్పికొట్టామని వ్యాఖ్యానించారు. ఈ రెండు కంపెనీలు స్టాక్ మార్కెట్ లో ప్రత్యేకంగా లిస్ట్ అయ్యాయనీ, మార్కెట్ విలువపరంగా ఈ రెండు కంపెనీలు దేశంలో టాప్-10 స్థానాల్లో నిలిచాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం జియోకు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని ముకేశ్ అంబానీ తెలిపారు. టెలికాం రంగంలో ఆదాయం, కస్టమర్ల పరంగా తమ కంపెనీ నంబర్ 1గా నిలిచిందన్నారు. ఇక రిలయన్స్ రిటైల్ రూ.1,30,000 కోట్లతో భారత్ లోనే అతిపెద్ద రిటైల్ సంస్థగా అవతరించిందని వెల్లడించారు. ఈ రెండు కంపెనీలు తమ గ్రూప్ నకు 32 శాతం ఆదాయాన్ని తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు.

 

akhilesh B Editor
Sorry! The Author has not filled his profile.
×
akhilesh B Editor
Sorry! The Author has not filled his profile.

Comment here