Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయ- అంతర్జాతీయతెలంగాణరాజకీయం

సుస్మాస్వరాజ్ భౌతిక కాయానికి ్రపముఖుల నివాళి..

తీవ్రమైన గుండెనొప్పి కారణంగా, గత రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు నేటి సాయంత్రం లోధీ రోడ్ లోని స్మశాన వాటికలో జరుగనున్నాయి. నిన్న రాత్రే ఆమె పార్థివ దేహాన్ని జంతర్ మంతర్ లోని నివాసానికి తరలించగా, అప్పటి నుంచి పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.

తొలుత ఆమె మృతదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ కార్యకర్తలు, నేతల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. 3 గంటల తరువాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం, లోధీ రోడ్ కు వెళ్లే రహదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

కేంద్రమాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపట్ల రాజ్యసభ సంతాపం ప్రకటించింది. సభ ప్రారంభంకాగానే సుష్మా మృతిపట్ల రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు.సుష్మా స్వరాజ్‌ ఆకస్మికంగా మరణించడం బాధాకరం. ఆమె మరణం తనతో పాటు దేశ రాజకీయాల్లో తీరని లోటు. ఉత్తమ పార్లమెంటేరియన్‌, సమర్థవంతమైన పరిపాలకురాలు, ప్రజావాణిని గట్టిగా వినిపించే నేత సుష్మా’ అని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు కొనియాడారు.

సుష్మాస్వరాజ్‎కి మోదీ కన్నీటి ప్రధాని నివాళులు:
భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయనం ముగిసింది. కోట్లాది మందికి ఆమె మార్గదర్శకురాలు.. ఇతర దేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన సుష్మాస్వరాజ్ మరణవార్త విని దిగ్ర్భాంతికి గురి అయ్యమని ప్రధాని మోదీ తెలిపారు.సుష్మాస్వరాజ్ పార్థీవదేహాన్ని సందర్శించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుష్పాంజలి సమర్పించి ఘన నివాళి అర్పించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సుష్మా మరణం దేశానికి తీరనిలోటన్నారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాళులు

మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ భౌతిక కాయానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా.. దేశవ్యాప్తంగా గొంతుక వినిపించిన ధీర వనిత సుష్మా స్వరాజ్ అని అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడానికి మూల కారణం సుష్మా స్వరాజ్ అని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా “తెలంగాణ చిన్నమ్మ”గా నిలిచిపోతారని అన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌

సుష్మాశ్వరాజ్‌ మన మధ్యలో లేకపోవడం బాధరంగా ఉందంటూ గోషమహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. 2014 ఎన్నికల్లో భాగంగా గోశామహల్‌లో సుస్మాస్వారాజ్‌ ప్రచారం చేశారంటూ రాజాసింగ్‌ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ చిన్నమ్మగా సుష్మస్వరాజ్‌ పేరు తెచ్చుకున్నారని వారు తెలిపారు. బెలుచిస్తాన్‌ విషయంపై ఐక్యరాజ్య సమితిలో అనేక సార్లు ప్రస్తావించారని, చివరి శ్వాస వరకు దేశం కోసం తపించారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్‌ కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ నేత నాగం జనార్థన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అమలుకు సుష్మస్వరాజ్‌ బిల్‌ పాస్‌ చేయించారని, తెలంగాణ వీర గాధ సుష్మాస్వారాజ్‌ అని నాగం అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్నాప్పుడు సుష్మాస్వరాజ్‌ తీవ్రంగా వ్యతిరేఖించారని అన్నారు.
టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీలు నివాళు
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీమంత్రి సుష్మాస్వరాజ్ పార్థివదేహానికి టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీలు నివాళులర్పించారు. సుష్మా మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని ఎంపీలు తెలిపారు. సుష్మాస్వరాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
పొంగులేటి సుధాకర్ రెడ్డి
కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వరాజ్‌ మృతికి సంతాపం ప్రకటించారు బిజెపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. సినిమా కార్మికులు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన పొంగులేటి రెండునిమిషాల పాటు మౌనం వహించారు.

https://www.youtube.com/watch?v=tChsdyZFUFU

phani babu Editor
Sorry! The Author has not filled his profile.
×
phani babu Editor
Sorry! The Author has not filled his profile.

Comment here