రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక

Published: Thursday March 25, 2021
వెల్గటూర్, మార్చి 24, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం గుల్లకోట ఉన్నత పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు బి.పూజిత, ఏ.నవ్య, వి.గాయత్రి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పి.ఈ.టి జి. శ్రీను బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు ఈ నెల 10వ తేదీన ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సెలక్షన్ లో జూనియర్స్ బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు.వీరు ఈనెల 25 నుండి  27 వరకు మహబూబ్ నగర్ లో జరిగే బోయే రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల విభాగంలో పాల్గొంటారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. శారద, ఎస్.ఎం.సి చైర్మన్ కాటు ఎలిష, సర్పంచ్ స్వరూప తిరుపతి గౌడ్,ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎం.పీ.టీ.సీ గొల్లపల్లి శ్రీజ మల్లేష్ గౌడ్, తె.రా.స మండల శాఖ ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్ టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాస రావు ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు, సీనియర్ క్రీడాకారులు భాష మహేష్, జైనాపురం సాయి, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణ్  అభినందించారు.