సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కావాల‌నుకుంటున్నారా..? కోర్సులు ఏంటో తెలుసుకోండి..!

Published: Wednesday July 27, 2016

 కొవ్వూరు న్యూస్ జూలై 27:   సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు ఎలాంటి వేత‌నాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. మన దేశంలో క‌న్నా అమెరికా వంటి దేశాల్లో అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు ఇంకా జీతాలు ఎక్కువ. అయితే వేత‌నం ఎక్కువ ఉన్నా ప‌ని కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అది వేరే సంగ‌తి. కానీ మీకు తెలుసా..? అస‌లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగ‌మంటే అందులో ఇంకా ఏమేం విభాగాలు ఉంటాయో. చాలా ఉంటాయి. సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్‌, అన‌లిస్ట్‌, ఆర్కిటెక్ట్‌, సాఫ్ట్‌వేర్ డిజైన్‌, డెవ‌ల‌ప‌ర్‌, ప్రోగ్రామ‌ర్ వంటి వివిధ కేట‌గిరీలు ఉంటాయి. వీట‌న్నింటిలోనూ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌, ప్రోగ్రామ‌ర్ విభాగాలు అత్యంత కీల‌క‌మైన‌వి. వాటిలో ప్రావీణ్యులైన వారికి మంచి జీతాలు ల‌భిస్తాయి. అయితే అలా ప్రావీణ్యులు కావాలంటే డిమాండ్‌లో ఉన్న కోర్సుల‌ను నేర్చుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే అనుకున్న విజ‌యాన్ని సాధిస్తారు. ఈ క్ర‌మంలో సాఫ్ట్‌వేర్ కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌, డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగాల కోసం ప్ర‌స్తుతం డిమాండ్‌లో ఉన్న కోర్సులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్‌క్యూఎల్ (SQL)…
డేటాబేస్ టెక్నాల‌జీ కోర్సుల్లో ఎస్‌క్యూఎల్ కీల‌క‌మైన లాంగ్వేజ్‌. సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌, ప్రోగ్రామ‌ర్‌గా ఎద‌గాల‌నుకునే వారు ఈ కోర్సును క‌చ్చితంగా నేర్చుకోవాలి. అందులో నిష్ణాతులు కావాలి. హాస్పిట‌ల్స్‌, బ్యాంకులు, యూనివర్సిటీల‌తో పాటు చిన్న‌, పెద్ద వ్యాపార సంస్థ‌ల్లో సాఫ్ట్‌వేర్ అవ‌స‌రాల కోసం ఈ లాంగ్వేజ్‌ను ఎక్కువ‌గా వాడ‌తారు.

జావా (Java)…
ఆండ్రాయిడ్ యాప్స్‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ప్రోగ్రామ‌ర్స్ క‌చ్చితంగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఇది. జావాపై ప‌ట్టు సాధిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించ‌డం చాలా సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది.

జావా స్క్రిప్ట్ (JavaScript)…
దీన్ని ఎక్కువ‌గా ఇంట‌ర్నెట్‌లో వెబ్ పేజీల‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు వాడ‌తారు. ఇది కూడా ప్ర‌స్తుతం డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ కోర్సుల్లో ఒక‌టి. జావా స్క్రిప్ట్‌ను కూడా అభ్య‌ర్థులు నేర్చుకోవాలి.

సీ హాష్ (C#)…
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను కూడా అభ్య‌ర్థులు నేర్చుకోవాలి. దీన్ని సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఈ లాంగ్వేజ్‌లో ప‌ట్టు సాధిస్తే ఉద్యోగ అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి.

సీ ప్ల‌స్ ప్ల‌స్ (C++)…
సి లాంగ్వేజ్‌కు మ‌రింత మెరుగులు పెట్టి దీన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఈ లాంగ్వేజ్‌ను కూడా సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ కోస‌మే వాడ‌తారు. అభ్య‌ర్థులు దీనిపై కూడా ప‌ట్టు సాధించాలి. ఇది కూడా ప్ర‌స్తుతం డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఒక‌టి.

పైథాన్ (Python)…
కొత్త‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాల‌నుకునే వారికి పైథాన్ చాలా బాగా ప‌నికి వ‌స్తుంది. ఇది కూడా సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ కోస‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని నేర్చుకుంటే ఇత‌ర సాఫ్ట్‌వేర్ విభాగాల్లోనూ ఉప‌యోగ‌ప‌డుతుంది.

పీహెచ్‌పీ (PHP)…
హెచ్‌టీఎంఎల్ (HTML) ఉప‌యోగించి క్రియేట్ చేయ‌బ‌డిన వెబ్ పేజీల‌కు పీహెచ్‌పీ స‌పోర్ట్‌నిస్తుంది. దీంతో వెబ్ పేజీల‌ను మ‌రింత సుల‌భంగా తీర్చిదిద్దుకోవ‌చ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను నేర్చుకునే వారు దీన్ని కూడా కంప‌ల్స‌రీ నేర్చుకోవాలి. ఇది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

రూబీ ఆన్ రెయిల్స్ (Ruby on Rails)…
వెబ్ ప్రోగ్రామింగ్ కోసం దీన్ని వాడ‌తారు. చిన్న స్టార్ట‌ప్‌లు మొద‌లు కొని, పెద్ద సంస్థ‌ల వ‌ర‌కు దీన్ని ఉప‌యోగిస్తాయి. ఈ కోర్సుకు కూడా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.

ఐఓఎస్‌/స‌్విఫ్ట్ (iOS/Swift)…
యాపిల్ సంస్థ‌కు చెందిన ఐఓఎస్ యాప్స్‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు దీన్ని వాడ‌తారు. ఐఓఎస్ యాప్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు ప్ర‌స్తుతం మంచి డిమాండ్ ఉంది కాబ‌ట్టి అభ్య‌ర్థులు దీన్ని కూడా నేర్చుకోవాలి.

తెలుసుకున్నారుగా..! ఏయే సాఫ్ట్‌వేర్ కోర్సుల‌కు మంచి డిమాండ్ ఉందో..! ఈ పోస్టును అంద‌రికీ షేర్ చేస్తే అది మిత్రులకి చేరి వారికి లాభం క‌లుగుతుంది.