హిందువులపై దాడి చేస్తే సహించేది లేదు --హిందువాహిని రాష్ట్ర శాఖ

Published: Friday August 05, 2022

రాయికల్, ఆగస్టు 05 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో  హిందూ వాహిని రాష్ట్ర నాయకులు వేముల సంతోష్ మరియు జిల్లా నాయకులు కొండ బత్తిని అమర్నాథ్ మాట్లాడుతూ గోరక్షణ, ధర్మరక్షణ చేస్తున్న హిందువులపై కొందరు కసాయి ముస్లింలు దాడులు చేస్తూ చంపడానికి వెనకాడమని రెక్కి నిర్వహిస్తూ మీ హిందువులకు మేము భయాన్ని చూపిస్తామని, దుర్భాషలాడుతున్నారని గతంలో గోవులను రక్షించిన వారిలో కుర్మ చిన్నమల్లారెడ్డి అనే వ్యక్తిని చంపుతామని బెదిరిస్తున్నారనివారు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మున్ముందు హిందువులపై ఎలాంటి దాడులు జరిగినా హిందు వాహిని చూస్తూ ఊరుకోదని,ప్రతి హిందువును చైతన్యపరిచి పోరాటం చేయడమే కాకుండా హిందువుల రక్షణ కొరకు ఎలాంటి చర్యల కైనా సిద్ధమని  హిందూ వాహిని రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు తెలిపారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని,ప్రతి హిందువు ను చైతన్యపరిచి గోమాతలను రక్షించుకుంటామని ఈ సందర్భంగా హిందూ వాహిని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరక్ష ప్రముఖ్ కాయితి గంగాధర్,ధర్మ జాగరణ ప్రముఖ్ కురుమ పెద్ద మల్లారెడ్డి, సుధీర్ సామల్లసతీష్, తదితరులు పాల్గొన్నారు.