సమాచార హక్కు చట్టంను పట్టించుకోని మండల పరిషత్ అధికారులు - మండల పరిషత్ కార్యాలయంలో కొన్ని అం

Published: Friday June 24, 2022
మధిర జూన్ 23 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు 
అనుమతి కోసం కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన మద్దెల ప్రసాదరావు మధిర మండలం ఆత్కూర్ క్రాస్ రోడ్లో  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈరోజు వైయస్సార్ తెలంగాణ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర 1200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మధిర మండలం ఆత్కూరు క్రాస్ రోడ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైఎస్ షర్మిల చేత ప్రారంభోత్సవం చేశారు. ఈ విగ్రహానికి అనుమతి లేదంటూ షర్మిల ప్రారంభించిన అనంతరం తొలగించారు. దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత సంఘం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు నాయకత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చట్టపరంగా ముందుకు వెళ్లాలని లక్ష్యంతో ముందుగా  అనుమతి కోసం కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా  మద్దెల ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తర్వాత ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా ఆత్కూరు సర్కిల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు మల్లారెడ్డి బోనకల్ మండలం అధ్యక్షులు మౌలానా మరియు రాంబాబు పాల్గొన్నారు.