మైలార్ దేవరంపల్లి లో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం

Published: Tuesday March 16, 2021
వికారాబాద్ జిల్లా, ప్రతినిధి మార్చి 15 ( ప్రజాపాలన ) : లోకకల్యాణార్థమే లక్ష్యంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపామని గ్రామ సర్పంచ్ ఆలంపల్లి తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలోని శివాలయంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని గ్రామ సర్పంచ్ ఆలంపల్లి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో లింగయ్య పంతులు వేద మంత్రోచ్ఛారణలతో పుర వీధులన్నీ ప్రతిధ్వనించేలా కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మా గ్రామం సంస్కృతీ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఆచరించామని వివరించారు. ఉదయం 8 గంటలకు అగ్ని గుండం, 10 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని జరిపించామని పేర్కొన్నారు. మంగళహారతి తీర్థ ప్రసాదాలు భక్తులకు వితరణ చేయనైనదని చెప్పారు. అనంతరం భక్తులకు నారాయణ సేవ (అన్నదానం) కార్యక్రమం నిర్వహించారు. రాత్రి భజన అనంతరం గయోపాఖ్యానం వీధి నాటకాన్ని ప్రదర్శించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దదలు ప్రజలు భక్తులు చుట్టు ప్రక్కలగ్రామాల ప్రజలు పాల్గొన్నారు.