కొత్త జగజ్జేత అవతరించిన రోజు

Published: Tuesday June J, 2016

నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరు. ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాట్స్​మెన్​, వికెట్లే లక్ష్యంగా బంతి విసిరిన బౌలర్లు. చివరకు మ్యాచ్ టై. ఓ సూపర్​ ఓవర్​. అది చాలక బౌండరీల లెక్కింపుతో విజేత నిర్ధారణ. క్రికెట్​లో వీటిలో ఏదో ఒకటి అప్పుడప్పుడూ జరగడం సాధారణం. కానీ అన్నీ ఒకేసారి ఒకే మ్యాచ్​లో కనిపిస్తే.. అది 2019 ప్రపంచకప్​ ఫైనల్​ అవుతుంది.వన్డే​ల హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ ఫైనల్​కు నేటితో(జులై 14) ఓ ఏడాది నిండింది. ఈ చారిత్రాక మ్యాచ్​ ఇంగ్లండ్​ జట్టు బౌండరీ ఆధారంగా న్యూజిలాండ్​పై నెగ్గి జగజ్జేతగా అవతరించింది. ఛేజింగ్​లో ఇంగ్లండ్​ బ్యాట్స్​మన్ బెన్​ స్టోక్స్​ పోరాటంతో ఆఖరి ఓవర్​లో ఆ జట్టు 15 పరుగులు చేయాల్సివుంది. అంతకుముందు డీప్​ వద్ద స్టోక్స్​ ఇచ్చిన క్యాచ్​ను ట్రెంట్​ బౌల్ట్​ జారవిడిచాడు.(‘గంగూలీలా ధోని చేయలేదు’)