ఎక్సైజ్ చట్టాన్ని ప్రశ్నిస్తున్న మద్యం మాఫియా

Published: Monday May 16, 2022

 ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి మే 15:

ఎక్సైజ్ చట్టాన్ని మద్యం మాఫియా ప్రశ్నిస్తుందని సీపీఐ కొడంగల్ మండల కార్యదర్శి శ్యాంసుందర్ బసంత్ అన్నారు. కోడి గుడ్డు వచ్చి కోడిపిల్లను వెక్కిరించిన స్థాయికి ఆబ్కారీశాఖ చేరిందని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖకు చట్టం ఉండి మంచి విధానాలు తయారు చేసుకునే అధికారం ఉన్నా అమలు చేసే యంత్రాంగం చేతిలో అది ఆత్మహత్య చేసుకున్నాదని ఆరోపించారు. గతంలో ఆబ్కారీ గుత్తేదారులు చట్టప్రకారం కల్లుసారాయి లు అమ్మలేక వారి ఆస్తిపాస్తులు హరాజ్ పాలయ్యాయన్నారు. ప్రస్తుతం చట్టాన్ని తుంగలో తొక్కి మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు మద్యం మాఫియా పాలకులు అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక చర్యల వలన ఆబ్కారీ చట్టం ఆత్మహత్య చేసుకోగా మద్యం మాఫియా కోట్ల సంపాదనకు చేరుకొని ప్రభుత్వాన్ని శాసిస్తుందన్నారు. ఎక్సైజ్ తో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న ప్రభుత్వాలు...అధికారులు నిపుణులు ప్రభుత్వ ఆదాయం మాఫియాలా ఆదాయం పై విశ్లేషిస్తే తెలుస్తుందన్నారు. ఓ పక్క మద్యపాన నిషేధం దిశగా అడుగులేస్తున్న ఆబ్కారీ విధానాలు అమలులో ఆమడదూరంలో ఉన్నాయన్నారు. ఆబ్కారీ విధానాల వలన ప్రభుత్వానికి లాభంతోపాటు ఎంతోకొంత మద్యం మాఫియా దెబ్బతినేదని చట్టాలు పాలసీలు అమలుతో లాలూచీపడటంతో ఆబ్కారీ చట్టాలపై మద్యం మాఫియా సవాల్ చేస్తుందన్నారు. ఆబ్కారీ చట్టాల అమలుపై సీపీఐ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఇందుకు నిరసనగా సోమవారం కొడంగల్ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తూ బెల్టు షాపులపై దాడి చేస్తామన్నారు. ధర్నాతో అధికారులు మేల్కొనకపోతే తట్టిలేపుతాం అని పేర్కొన్నారు.