అప్నా యూత్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో లో ఉచిత నేత్ర వైద్య శిబిరం

Published: Monday May 02, 2022

కొడిమ్యాల, ఏప్రిల్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని రామకృష్ణాపురం గ్రామంలో అప్నా యూత్ వెల్ఫేర్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిం చారు. కంటి పరీక్షలు చేయించుకున్న గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామానికి వచ్చి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కావలసిన మందులు మరియు కంటి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది అప్తోమేటరిస్ట్ డా"శివరాజ్, చందు, లత, శ్రీనివాస్ మరియు గ్రామస్తులు తదితులు పాల్గోన్నారు.