పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ.

Published: Friday March 05, 2021

జన్నారం మార్చి 4 ప్రజా పాలన: మండలంలోని కవ్వాల్ గ్రామంలో గురువారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ రాథోడ్ లక్ష్మీ కాల్ రామ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తులంతా కలిసి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందని గ్రామంలోని ప్రతి ఇంటిలో నుండి ఒక బోనాన్ని కచ్చితంగా పోచమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుందన్నారు.