మడుపల్లి తాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు

Published: Thursday March 04, 2021
మధిర, మార్చి 4, ప్రజాపాలన ప్రతినిధి: మధిర మున్సిపాలిటీ పరిధిలో వైరా నది పై నూతనంగా చెక్ డ్యామ్ నిర్మాణం పనులు చేపట్టగా నీటిని మధిర శివాలయం వైపు మరలించడం జరిగింది. దీని వలన మడుపల్లి కి సప్లై చేసే పంప్ ల దగ్గర భూగర్భ జలాలు పడిపోయి మోటార్స్ సరిగ్గా నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి వెంటనే స్పందించిన కౌన్సిలర్స్ ఐ బి డి ఈ గారు, ఏ ఈ గారితో మాట్లాడి సమస్య గురించి వివరించడం జరిగింది. దానికి ఆ శాఖ వారు అనుకూలంగా స్పందించి శివాలయం ఎదురుగా ఒక కాలువ కొట్టించి మళ్ళీ పంప్ ల దగ్గర నీళ్లు  నిలువ ఉండేలా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు తొగారు ఓంకార్, మేడికొండ కిరణ్ గ్రామ పెద్దలు పులిచర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.