మత్స్యగిరి ఆలయంలో స్వాతి కళ్యాణం

Published: Thursday March 04, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం వేదపండితులచే ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రవికుమార్ ఆలయ కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి దంపతులు, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.