స్వామి అయ్యప్ప దేవాలయంలో నేడు సాయంత్రం మకరజ్యోతి దర్శనం

Published: Friday January 14, 2022

మధిర జనవరి 13 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో నడకదారిలో వేచి ఉన్న స్వామి అయ్యప్ప దేవాలయంలో సంక్రాత్రి పండుగ సందర్భంగా అనేక ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ చలవాది శ్రీనివాస్ ధర్మారావు పండగ సందర్భంగా కార్యక్రమాలు కార్యక్రమాలు వివరాలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి అయ్యప్ప దేవాలయాల్లో లో శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం, మధిర నందు తెలుగు సంప్రదాయం ప్రకారం నేడు అనగా 14 జనవరి శుక్రవారం భోగి పర్వదిన సందర్భంగా ఉదయం 5:30 కు భోగిమంటలు, హరిదాసు కీర్తనలు, నిత్య గణపతి హోమము, శ్రీ స్వామి అయ్యప్ప వారికి ప్రత్యేక అభిషేకము నిర్వహించబడుచున్నది. సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం నకు ఆభరణములతో చేరుట తదుపరి జ్యోతి దర్శనము, ఆభరణములతో స్వామి దర్శనం. ఈ విశేషమైన పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు, శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం. భక్తులు మాలధారులు అందరూ వచ్చి స్వామి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వారు తెలిపారు స్వామి శరణం అయ్యప్ప శరణం