కొవ్వూరు నియోజకవర్గం ఎన్నికల ముఖచిత్రం .

Published: Tuesday June J, 2016

     తెలుగుదేశం పార్టీ ఆవిర్బవం నుండి తెలుగు దేశం పార్టీకి ఆంద్రాసుగర్స్‌ యాజమాన్యం వెన్నుదన్నుగా నిలిచింది. నాటి నుండి నేటి వరకూ తెలుగుదేశం పార్టీకి ఆంద్రాసుగర్స్‌ యాజమాన్యం చూపించిన వ్యక్తికే ఎం.ఎల్‌.ఏ.టికెట్టు వస్తూంది. 1983 తెలుగుదేశం ఆవిర్బవంలో ఆంద్రాఫారం కెమికల్స్‌ అధినేత పెండ్యాల వెంకటకృష్ణారావు (కృష్ణబాబు) 65893 ఓట్లు రాగా అజీజ్‌కు 10983 వచ్చాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టితో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ది మాజీ మంత్రి ఎం.ఎ.అజీజ్‌పై గెలిచి కృష్ణబాబు రికార్డు సృషించారు. 1985లో జరిగిన మద్యాంతర ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ది కృష్ణబాబుకు 61899 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ది  ఇమ్మణ్ణి శేషగిరిరావుకు 29116 ఓట్లు వచ్చాయి. దీనితో కృష్ణబాబు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ది ఇంమ్మణి శేషగిరిరావుపై  29116 ఓట్లు మెజార్టితో కృష్ణబాబు గెలిచారు. 1989 ఎన్నికలలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల మద్య నువ్యా నేనా అన్నట్లు జరిగాయి.  ఈ ఎన్నికలలో కృష్ణబాబుకు 60116 ఓట్లు రాగా ఎం.డి.రఫీయుల్లా బేగ్‌కు 52824 ఓట్లు వచ్చాయి.ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ది ఎం.డి.రఫీయుల్లా బేగ్‌ పై 7292 ఓట్లు ఆదిక్యతతో కృష్ణబాబు గెలుపొందారు. 1994 ఎన్నికలలో రెండు పార్టీల మద్య ఎన్నికలు అనడం కంటే రెండు కులాల మద్య ఎన్నికలు అన్నట్లు జరిగాయి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ది కృష్ణబాబుకు 66395 ఓట్లు రాగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ది జి.ఎస్‌.రావుకు 50193 ఓట్లు వచ్చాయి. దీనితో జి.ఎస్‌.రావుపై కృష్ణబాబు 16202 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 1999 ఎన్నికలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగా కొవ్వూరులో మాత్రం కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ది జి.ఎస్‌.రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్ది కృష్ణబాబుపై గెలుపొందారు. ఈ ఎన్నికలలో జి.ఎస్‌.రావుకు 63721 ఓట్లు రాగా కృష్ణబాబుకు 57185 ఓట్లు రావడంతో 6536 ఓట్లు మెజార్టీతో జి.ఎస్‌.రావు గెలుపొందారు. 2004 ఎన్నికలలో తిరిగి జి.ఎస్‌.రావు, కృష్ణబాబులు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల నుండి పోటీపడ్డారు. ఈ ఎన్నికలు కూడా నువ్యా నేనా అన్నట్లు జరిగాయి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ది కృష్ణబాబుకు 65329 ఓట్లు రాగా జి.ఎస్‌.రావుకు 63998 ఓట్లు వచ్చాయి.  ఈ ఎన్నికలలో 1331 ఓట్లు అతి స్వల్ప మెజార్టీతో కృష్ణబాబు గెలుపొందారు. ఈ ఎన్నికలలో కొవ్వూరులో కృష్ణబాబు గెలుపొందినా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందింది. ఇప్పటి వరకూ  జనరల్‌ కేటగిరిలో ఎన్నికలు జరుగగా 2009 ఎన్నికలకు కొవ్వూరు నియోజకవర్గం షెడ్యూల్‌ కులాలకు రిజర్వు అయ్యింది. దీనితో గత మూడు ఎన్నికలలో కమ్మ కాపు కులాల మద్య జరిగిన ఎన్నికల పోరాటంకు ముగింపు వచ్చింది. 2009 ఎన్నికలలో జిల్లా తెలుగుయువత అధ్యక్షులుగా ఉన్న  టి.వి.రామారావు తెలుగుదేశం పార్టీ తరపున పోటీకి దిగగా, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కొయ్యే మోషేన్‌రాజు కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీకి దిగారు. ఈ ఎన్నికలలో టి.వి.రామారావుకు 55669 ఓట్లు రాగా కొయ్యే మోషేన్‌రాజుకు 40191 ఓట్లు వచ్చాయి. 15478 ఓట్లు ఆదిక్యతతో టి.వి.రామారావు గెలుపొందారు. ఈ ఎన్నికలలో కూడా కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్ది గెలుపొందినా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందింది. 1983 నుండి 2009 వరకూ తెలుగుదేశం పార్టీకి వెన్నుధన్నుగా ఉన్న కృష్ణబాబు వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీకి జంప్‌ అవగా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు పార్టీ పగ్గాలు చేపట్టారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీనుండి స్థానికంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె.ఎస్‌.జవహార్‌ తెలుగుదేశం పార్టీ నుండి పోటీకి దిగగా వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ నుండి తానేటి వనిత, కాంగ్రెస్‌ పార్టీ నుండి గుమ్మడి సమర్పణరావులు పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ గల్లంతు కాగా జవహార్‌కు 74661 ఓట్లు రాగా వనితకు 61916 ఓట్లు వచ్చాయి. 12745 ఓట్లు ఆదిక్యతతో తెలుగుదేశం పార్టీ అభ్యర్ది జవహార్‌ గెలుపొందారు.  

ఎడిటర్ : గోలి వెంకటరత్నం