శ్రీ పల్లి దేవా సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

Published: Friday December 10, 2021
మధిర డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం వివిధ గ్రామాల్లో షష్టి సందర్భంగా ఈ రోజున సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీమాన్ శేషాచార్యులు  ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ పల్లి దేవా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ అనంతరం దెందుకూరు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అదేవిధంగా బంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అయ్యప్ప దేవాలయంలో అనేక దేవాలయాల్లో సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి సందర్భంగా కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు అదేవిధంగా భారీ ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొని సుబ్రమణ్య స్వామి కళ్యాణం తిలకించి స్వామి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా ఆయా దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కపిలవాయి జగన్ మోహన్ రావు మరియు కమిటీ బృందం పాల్గొని వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కళ్యాణాన్ని తిలకించారు