పిజి పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో లేక పోవడంతో అయోమయంలో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్య

Published: Monday September 13, 2021
హైదరాబాద్, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : అందుబాటులో లేని హాల్ టికెట్స్. అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు. పిజి పరీక్షల హాల్ టికెట్లు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో అందుబాటులో లేకపోవడంతో అయోమయంలో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులు. కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం విదితమే. దీనితో అన్ని రంగాలు కుదేలయినాయి. కరోనా మూలంగా విద్యార్థుల చదువులు అటకెక్కినాయని ఆవేదన చెందిన తల్లిదండ్రులు. ఇందులో దూర విద్యా విద్యార్థులు తీసిపోలేదు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం 24 జులై 2021 నాటి ప్రకటన ప్రకారం 13 సెప్టెంబర్ 2021 నుండి యంబిఎ మరియు ఇతర పిజి మూడవ సంవత్సరం/మూడవ సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయని ప్రకటించారు. నేటి వరకు అంటే ఆదివారం 12 వ తేది వరకు కూడా పిజి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు అంబేద్కర్ విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లోకి రాలేదు. అంతే కాకుండా పిజి పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు అయోమయంలో పడుతున్నారు. 13 సెప్టెంబర్ సోమవారం నుండి పిజి పరీక్షలు మొదలవుతాయా లేదా అని ప్రశ్నిస్తున్న విద్యార్థులు. పిజి పరీక్షలు జరుగుతవా లేదా? అనే సంధిగ్దంలో ఉన్న విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత యునివర్సిటీ అధికారులది‌. వెంటనే 13 సెప్టెంబర్ నుండి జరుగవలసిన పిజి పరీక్షల గురించి విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో పొందుపరిచి వారి సందేహలను నివృత్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.