విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

Published: Thursday September 09, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల నందు(బిసి కాలనీ) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగా గురునాథరెడ్డి ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పెన్సిల్లు, స్కేల్ లు, 104 విద్యార్థులకు 14 వేల విలువచేసే వాటిని, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పిటిసి శీలం కవిత, సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, ఎం ఈ వో వై ప్రభాకర్ చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి, మరియు పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు జంగా గురునాథ రెడ్డి కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మహిళా మండలి అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, హై కేర్ హాస్పిటల్స్ సర్జన్ మురళీ కృష్ణ రెడ్డి, ప్రవీణ్, పాఠశాల చైర్మన్ వేమిరెడ్డి పాపిరెడ్డి ఉపాధ్యాయులు గోలి చిన్నప్ప, సుకన్య పాల్గొన్నారు.