కేసిఆర్ పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమం

Published: Thursday February 18, 2021

మధిర, ఫిబ్రవరి 17, ప్రజాపాలన:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పుట్టినరోజు సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ హరితహారం సంకల్పంతో ఈరోజు మధిర  మడుపల్లి మున్సిపాలిటీలో రైతు వేదిక ఆవరణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యాలత గారు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శీలం వెంకటరెడ్డి గారు ఆరో వార్డు కౌన్సిలర్ తోగరు వరలక్ష్మి ఓంకార్ గారు, ఐల్లూరి ఉమామహేశ్వర్ రెడ్డి, రేగళ్ళ సాంబశివరావు, పారుపల్లి భద్రరావు, కంభం శివకృష్ణ, చింతల  వెంకటేశ్వర్లు, వేల్పుల నాగరాజు, లోకనాథం శ్రీను తదితరులు పాల్గొన్నారు